ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కఱ్ఱి కోడే కాలు - దువ్వింది మగడా
నాతోడు రంకాడ లేదు - అబ్బతోడు రంకాడ లేదు
నీతోడు రంకాడ లేదు - అమ్మతోడు రంకాడ లేదు

అన్నీ సరేకాని - ఇన్ని సరేకాని
చెంపనున్న కాట్లు - ఎక్కడివె భామా? నీ
చెంపనున్న కాట్లు - ఎక్కడవె భామా
ఆత్తేరి కాట్లు - ఎక్కడివె భామా
ధూత్తేరి కాట్లు - ఎక్కడివె భామా

కొమటో రింటికి - కొబ్బరికి బోతేను
తక్కెట్లో గుండోజ్చి - తగిలింది మగడా
తక్కెట్లో గుండోజ్చి - తగిలింది మగడా
నాతోడు రంకాడలేదు - నీతోడు రంకాడలేదు
అమ్మతోడు రంకాడ లేదు - అబ్బతోడు రంకాడలేదు.

అన్నీ సరే కాని - ఇన్నీ సరేకాని
మంచం క్రింది వాడు - ఎవ్వాడె భామా? నీ
మంచం క్రింది వాడు - ఎవ్వాడె భామా
ఆత్తేరి వాడెవ్వాడె భామా
ధూత్తేరి వాడెవ్వాడె భామా