ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదము కీర్తన, జవలి — వీటి పుట్టువూ వ్రుద్దీ కనిపెట్టటము అందమైన పని. అది ఇంకా జరగవలసియున్నది.

ఇక్కడ ఉదహరించిన కోపులు నేటరేవట తెలుగు నాట వినిపించే పాటలే.

చందమామ చందమామ చందమామా
అంద చందాల ముద్దు చందమామా
పాలకడలి తరగలందు చందమామా
బాలుడవై బుట్టినావు చందమామా
పాలాక్షు శిరమునందు చందమామా
బాల చంద్రరేఖ వీవు చందమామా ...చంద
పాలుత్రాగు పిల్లలకు చందమామా
పాలవిల్లి బంతి వీవు చందమామా
చల్లగ మాతోడు రావొ చందమామా
చందమామ చందమామ చందమామా
అంద చందాల ముద్దు చందమామా


ఈ కోపులలో పాండిత్యమూ భాషా సంస్కారమూ కనబడతవి. నాయకుడు చదువుకున్న వాడే ఆవుతాడు సామాన్యంగా. అంటే అక్షరాల పండితుడని కాదు, శ్రుత పండితుడనుట.

57