ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంచువారు

చెంచు వారిళ్లలో చెడ్డ కొలవనివారు
       చేరుటమ్ములచేతనూ
వీపునాయిమరిల్లు విల్లుటంబులుచేత
       యిల్లు వెళ్ళని చెంచులూ
పొద్దుపోయె యింటికి పోవాలెగూటికీ
       దోవదొలుగూ ఓగులూ
పొద్దుబోతే కనక బద్దికురులున్నాయి
       వెతకవే వెదురు బియ్యము
వెదుకు బియ్యపు కూడు మదన చక్కెరతోడ
       మదములేకలబలకవు
ముదముదగమానుముందకది నెల్లీవనము
       ముందరది నెల్లివనమూ
మెట్టి కాళ్ళాదాన మెట్టించి నడచేవు
       కాలి ముల్లి రగదంటే
అరికాళ్ళో వున్నాది అరవై ఆరు ముళ్లు
       ఆడదీ జాణతనమూ
కూచ్చొనీ ఆముల్లు కుదురుగా తియబోతె
       కుదరనీయరు చెంచులూ
పండుకోనీ ముల్లు పాటిగా తియబోతె
       పండనీయరు చెంచులూ
చెంచువారిళ్లలో చెడ్డ కొలవనివారు
       చేరుటమ్ముల చేతనూ

51