ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేయించు అన్నయ్య వెండిపొన్నుల్లు
సువ్వని నేనొక్క పోటేసితేనూ
చుక్కలు పిక్కటిల్లు సూకన్నకదలు
అస్సని నేనొక్క పోటేసితేనూ
ఆకసమ్మూ కదలు ఆరాజుకదలు

2



ముగ్గురన్నలతోడ నేబుట్టినాను
నానడుము మువ్వంచు చీరగోరింది
నలుగురన్నలతోడ నేబుట్టినాను
నానడుము నల్లంచు చీరగోరింది
అయిదుగురన్నలతోడనేబుట్టినాను
నొవొళ్లు అద్దాల రవిక గోరింది

3



కోడలా కోడలా కొడుకు పెళ్లామా
పచ్చిపాలమిది మీగడయేదీ
వేడిపాలమీది వెన్నలుయేవి?
నూనెముంతలమీద నురుగులుయేవి?
అత్తరో ఓ అత్త ఆరళ్ల అత్త
పచ్చిపాలమీద మీగడుంటుందా
వేడిపాలమీద వెన్నలుంటాయా
నూనెముంతలమీద నురగలుంటాయా

47