ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 రాట్నము


——దంపుళ్ల పాటవరసలో తరువోజల్లాగ వినపడే ఈ పాటలన్నీ లోకవృత్తానికి దర్పణాలే ఊహలూ ఉద్దేశాలూ భావాలూ అల్లుకుని వుంటాయి వీట్లో. కవ్వమాడనియిల్లు కదురు తప్పనికొంప కానరాని ఆరోజుల కుదురైన సంతుష్టిని ఈపాటలు చక్కగా బింబిస్తాయి.

అందచందములేని ఆడకూతురికి
అందమేరుపరుచు ఆపత్తి చెట్టు
పాడిపంటలున్న బంగారమిచ్చు
పైడి పత్తిని పెంచ బంగారు హెచ్చు
పాలు పెరుగులున్న పాపల కొఱకు
పత్తి నూలు దీయ పాతల కొఱకు
కవ్వమాడని యిల్లు కదురు తిప్పని కొంప
మగ్గము లేనూరు మరి గానరాదు
రాట్నాల మ్రోతమ్మ రవ్వలా మోత
కనకగిరి గొల్లోరి కవ్వాల మోత
ఏకుళ్ల రాట్నము కాళ్ల సంకెళ్లు
కలవారి అల్లుడి కాళ్ల సంకెళ్లు
ఏకేకు ఒక బార ఎల్లుండి సంత
నాయేకులయిపోయె నాకేమి చింత
పుంజమ్మ నూలుకు పోగు తక్కు
కొండ మీద పోద్దుంది కొట్టబోకత్త
చేని వారొస్తారు చెప్పబోకత్త


తక్కు వైన పొగును భర్తీ చేయుటకని చేనిలో పత్తిని తస్కరించినది కాబోలు.

44