ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాజారమ్మ తోట


——లయబద్ధములైన పనులకు లయబద్ధమైన పాటలతో మైత్రి చక్కగా కుదురును. ఈ పాట 'కిటతక కిటతక' అన్న ఎనిమిది అక్షరాల ఆవ్రుతాలు నాలుగేసి చేరి ఏర్పడిన పాదాలది. మొక్కలను గానీ, నీటికుండలను గానీ, వరసగానిల్చి ఒకరి నుంచి ఇంకొకరికి అందించుకునే జట్లు ఈపాట పాడుతారు. మొదటి అవ్రుతము కుండనందుకోటానికి తరవాతిది కుండను పక్కవారికి అందించటానికి ఊత అవుతుంది.

నాటేరమ్మా నాటేరు, ఏమీ మొక్క నాటేరు
జాబారమ్మా పూలతోటలో,జాజీ మొక్కనాటేరు
సాగేనమ్మా సాగేను, ఏమి తీగ సాగేను
జాజారమ్మా పూలతోటలో, సన్నా జాజీ సాగేను
యేసేనమ్మా యేసేను యేమిసిగురు యేసేను
జాజారమ్మా తోటలోను చేమంతులు సిగురేసేను
తొడిగేనమ్మా తొడిగేను ఏమి మొగ్గలు తొడిగేను
జాజారమ్మా తోటలోను రోజా మొగ్గలు తొడిగేను
విచ్చేనమ్మా విచ్చేను ఏమిపూలు విచ్చేను
జాజారమ్మా పూలతోటలో సంపెంగలూ విచ్చేను ||

పూలతోట పనిలోనే కాదు.. ఇటికెలు అందించుకుంటు గుట్ట వేసేటప్పుడుకూడా ఈ పాట పాడటము కద్దు.

34