ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిది వాకిళ్లు తుమ్మెదా, నీవు
నమ్మి చరించావె తుమ్మెదా
ముమ్మూల కోణాల తుమ్మెదా నీవు
నెమ్మాది నుండావె తుమ్మెదా ౹౹శివశివ౹౹
పది పదేనింటనూ తుమ్మెదా, వెండి
పదునొండు ఠావులను తుమ్మెదా
మెదలాక నిల్చినా తుమ్మెదా నిన్ను
కదలించగలరటే తుమ్మెదా ౹౹శివశివ౹౹
ఎనసితోట పువ్వుతుమ్మెదా నీ
వెనయమాన లేక తుమ్మెదా
దానిచేజిక్కినా తుమ్మెదా, తోట
వాని చేబడుదూ వే తుమ్మెదా ౹౹శివశివ౹౹
నింగి నేల వేయు తుమ్మెదా
గంగ గవురు లేనినాడు తుమ్మెదా
పొంగుచును నోరబోడ? తుమ్మెదా వేయు
భంగులానటియించు తుమ్మెదా ౹౹శివశివ౹౹
వేయి రేకుల పువ్వు తుమ్మెదా, అది
వెలుగూను జగమెల్ల తుమ్మెదా
సద్గూరు నడుగావె తుమ్మెదా పువ్వు
సద్యజూపూనీకు తుమ్మెదా ౹౹శివశివ౹౹
గురునాకు హరునాకు తుమ్మెదా, అం
తరువులేదేమి తుమ్మెదా