ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తుమ్మెద పదము

——తుమ్మెద పదములను గురించి పాల్కురికి సోమనాథుడు ( కీ. శ. 1800) మొట్ట మొదట చెప్పినాడు. ఈ పదాల చరణముల చివర తుమ్మెదా అన్న మాట విధిగా వచ్చుచుండుటే వీటి ఈ పేరునకు కారణము. తుమ్మెదా అన్నది ఈ తత్వము లోవలె జీవుని గాని, అన్నమయ్యది, 'తొల్లిటివలె గావు తుమ్మెదా ' అన్న సంకీర్తనములో వలె పరమేశ్వరునో—— ఏవూరు ఏపల్లె తుమ్మెదా' అన్న పాటలోవలె ఒక వ్యక్తి నో ఉద్దేశించి అనేమాట. ఈ పదము ఏగంటి వనాలలోనిది. ఏగంటి సంజేశ్వరునికి అంకితము, గార్లపాటి లక్ష్మయ్య గారు రచించినది. ఈయన పోసెట్టి లింగకవికి గురువే అయినచో ఇంచుమించు అన్నమయ్యకు సమకాలికులు అయి యుందురు. ఈ యుద్దరి రచనలకున్నూ గతి, సామ్యము చాలా కనబడుతున్నది. సంప్రదాయము ఈయన రచనలను "వచనములు" అన్ననూ, పోసెట్టి లింగకవి "పాటలు" అనే అన్నాడు.

శ్రీకంఠుడను పువ్వుతుమ్మెదా - మూడు
లోకమ్ములాయెను తుమ్మెదా
సాకారమైయుండు తుమ్మెదా - పర
మైకాంతమున జూడు తుమ్మెదా
శివళివాయన వే తుమ్మెదా
శివుడనగ విన్న మేల్ తుమ్మెదా
శివుని భక్తులకు తుమ్మెదా
శివశిరణన్న మేలె తుమ్మెదా
ముట్టిముట్టనీ పువ్వు తుమ్మెదా
ముట్టింది జగమెల్ల తుమ్మెదా
ముట్టిచూడ వేల తుమ్మెదా - అది
ముట్టిపాయలే వె తుమ్మెదా ౹౹శివశివ౹౹