ఈ పుట అచ్చుదిద్దబడ్డది

         ఎడ్చేవారు మరి ఆర్చేవారు
         ఎవరు రారు వెంట ౹౹విష్ణు౹
తొలినాడు యములోళ్ళ నైనతను
గుంజుకు రమ్మంటా
         యములోళ్ళంతా చుట్టునిలిచినరు
         తాళ్ళూ తెమ్మంటా ౹౹విష్ణు౹౹
చిన్న పెద్దలూ కూర్చున్నారు
ఛింతలు పడుకుంటా
         నీళ్ళుబోసి కూర్చుండ బెట్టనరు
         మాయ బొమ్మ నంట ౹౹విష్ణు౹౹
పువ్వుల దండలు వేసినరయ్యా
మాయ బొమ్మ కంట
         ఎత్తండి ఎత్తండి ఎత్తండోయి
         మట్టి బొమ్మనంటా
         దింపుడు కల్వము కాడ దింపినరు
         మాయ బొమ్మ నంట
సొమ్ము సమస్తము తీసుకున్నరూ
పోతరు వారంతా
గురువు పోస్తడూ శంఖు తీర్థమూ
ముక్తి ఫలము కంటా