ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఊగూగు గొంతెమ్మ తుమ్మెదా, సేరూలని పింది తుమ్మెదా
“ఎక్కడిది యానంది తుమ్మెదా, యేడాది యీనంది తుమ్మెదా
గొంతెమ్మ పెంచినా తుమ్మెదా, గొలుసుళ్ళా నంది తుమ్మెదా”
మానంది కొట్టోదు కాపన్నా, మమ్ములా తిట్టొద్దు కాపన్నా
మానంది బందెలా తుమ్మెదా, మేమిచ్చు తామయ్య తుమ్మెదా
సోలతో సోలెడు తుమ్మెదా, మాడలేసూకోని తుమ్మెదా
ఇదిగోర కాపన్న తుమ్మెదా, మానంది బంది తుమ్మెదా
ఇక్కడకు తీరదు తుమ్మెదా, మీనంది బంది తుమ్మెదా
తవ్వతో తవ్వడు తుమ్మెదా, మాడ లేసుకోని తుమ్మెదా
    ... ... ... ...
మానెతో మానెడు తుమ్మెదా, మాడలేనుకోని తుమ్మెదా
    ... ... ... ... ...
అడ్డతో అడ్డెడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
... ... ... ... ...
కుంచముతొ కుంచెడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
... ... ... ... ...
పన్నెండు చెంగులు తుమ్మెదా, పట్టు పంచలూను తుమ్మెదా
పట్టుమన కాపన్న తుమ్మెదా, పైమీద కప్పింది తుమ్మెదా
చాలునని కాపన్న తుమ్మెదా, సంతోష పడ్డాడు తుమ్మెదా
మేడలో గొంతెమ్మ తుమ్మెదా, ఏలాగూ నందో తుమ్మెదా
పొరుగూరిచేలోకి తుమ్మెదా, పోబోకు నందో తుమ్మెదా
పొరుగు బందులు మాకు తుమ్మెదా, తేబోకు నందన్న తుమ్మెదా
కట్టండి నందినీ తుమ్మెదా, గాజుల్ల కంబాల తుమ్మెదా
వెయ్యండి సందికీ తుమ్మెదా, వెయ్యికట్లా చొప్ప తుమ్మెదా ౹౹

,

15