ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారసిమ్మ నిన్నె నమ్మితీ-నానాటనే
కోరితినీ పాదమేగతి
ఔర కొలువు కంబాన- సేరిపెమలాదుగాసి
కోర మీసమైన శత్రు గుండెలగల జీల్చినోడ
బుడుత భావనయ్య వైతివీ-ఆచక్రవర్తి
నడిగి భూమి గెలుసు కొంటివీ
పొడుగు కాళ్లీడవై అడుగువానిమీదబెట్టి
తడవు లేక లోక మెల్లపుడిక్కోని తిరిగినోడ ౹౹
రెండు పదులు వొక్కమారుతో ఆదొర్ల, నెల్ల
చెండాడి తౌర పరశుతో
చండ కోలబట్టి కో
దండ రామసామి కాడ
చెండుకోల సేనుకోని
కొండ కప్పుడేగినోడ ౹౹
రామదేవ రచ్చింపరా మా కెల్ల
భూమిలోన బుద్ధి సెప్పరా
         ఏమి తప్పు సేసినాడ సామినాయప్పబుద్ధి
         నీమనసు చల్లదనము మామిదసూపరోరి !
దేవక్క దేవి కొడుకురా మా కెల్ల
దేవుడై నిల్చినావురా
ఆవుల మేపి కోని ఆడోళ్ల గూడుకోని
తావు బాగ సేసికోని తకిడి చిక్కిడి 'సేసినోడ ౹౹