ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పయనము

——ఇది ఎవరో పాకృతుల తైలాపలె నున్నది. తాను అత్తింటికి కాబోలు-పయనమౌ టను దయగల సామిద్వారా వలపుకానికి తెలుపుచున్నది.

ఒండుకోను ఒడ్డెపల్లె పండుకోను పల్లెపెరుగు,
ఒల్లకుంటే గొల్లపల్లెయ్యా, దయగల్ల సామీ
రేపుపయనామాని దెల్పారోయి
మిట్ట లెక్కి చూసువాడ ముష్టి కాకర సెట్టు కాడ
ముద్దు ముద్దు గలసిపోయేరా, దయగల్లసామీ
రేపు పయనామాని దెల్పారా
కానరానీ గట్టుమీదా కమ్మ గెగ్గెర సెట్టుకాడ
కారణాలు సెల్లిపోయెరా, దయగల్లసామి
రేపు పయనామాని దెల్పరా
నీళ్లులారా నిమ్మలారా నిత్య బూసిన మల్లెలారా
నీళ్ల కొచ్చిన నీళ్ల గన్నోయి, దయగల్ల సామీ
రేపు పయనామాని దెల్పరా

"ఈటికీ యేడామడేటికీ యేడామ డెల్లుట్ల దురగమూ అత్తిల్లు బోతిరా సిన్నోడ పుట్టిల్లు దవ్వాయెరా మరిసినామరువు రాదోయి మరువెల్ల నీమీదెరా" అన్న పడుచు ఈకోవలోనిదే.