ఈ పుట అచ్చుదిద్దబడ్డది
బైరన్న
——ఇది పక్కా రంకులాడి కథ. కుంటెన మగనికి ఉపాయములు చెప్పుచున్నది.
అప్పనా తనామన మారోరిబై రనా
మారోరి బైరన రాగోరె బైరనా అప్పనా
ఇంటి ముందు యీతపొద
ఇంటి యెనక గచ్చపొద
ఒంటిగాను రాబోకు
ఒరుల జిక్కి పోదువురా అప్పనా
సవతితల్లి పెట్టుపోత
పగలు రేయి కత్తి కోత
గుమ్మమైన దాటనీరు
గుసగుసలు ఆడనీరు అప్పనా
రాత్రి రెండు జాములకు
రావిచెట్టు కిందనుండు
యింట్లోవారు సూడకుండ
ఎటులోనిను కలసెదరా అప్పనా
వచ్చెబోయె దారిలోను
పిచ్చికుక్కలున్నవిరా