ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెయ్యిమీద చెయ్యి

దూరిసూడూ దుక్కి సూడూ, దున్నపోతుల మడకసూడూ
వుండరాదుర ముండమోపులూ, బంగారిసామి
          ఉండరాదుక ముండ మోపులూ
ఆరుగంపా దూరుగంపా, బాలుడేసిన తుమ్మకంపా
తుమ్మకంపలు దూరిపోతబ్బీ, బంగారిసామి
          తుమ్మముల్లు రొమ్మునాటేనూ
అంచునంచున వరుస లేసీ, పంచవన్నె ముగ్గు లేసీ
అరుగుమీదాపండుకొంటిరా, బంగారిసామీ
          ఆడుదానీ బాసలేడరా
ఏటిగడ్డా సేనినాడా, ఏపకవురూ మంచెవాడా
ఎన్నుమిదా గువ్వవాలెనురా, బంగారిసామి
          సెయ్యిమీదా సెయ్యిదియ్యిరా !

. ఎవరో చూచుచున్నారని సూచన !