ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయుడు

——ఇది పక్కా వీధిసాని, రూపాయలు, కాసులు, ముక్కు పుడక కడియాలు, పావడలు, నాగరము, మట్టెలూ ఎన్నో పుణుకు కున్నది. చివ్వరికి ? వినండి.

నాయుడోళ్లింటికాడ | నల్లతుమ్మ చెట్టుకాడ,
నాయుడేమన్నాడే పిల్లా? అబ్బ; ఎంతవింతగున్నా వేపిల్లా !
నాయిడోళ్లింటి కాడ | నల్లతుమ్మ చెట్టుకాడ
నాలుగు రూపాయలిస్తానన్నాడమ్మా ! అబ్బ నాగుండె
                                    ఝల్లుమన్న దేలమ్మా
కోమటోరింటికాడ | గున్న మామిడి చెట్టుకాడ
కోరికోరేమన్నా పిల్లా?
కోమటోరింటికాడ | కొట్టుబాజారుకాడ
కోరి; కోరి; రమ్మన్నాడమ్మా !
కరణంగారింటి కాడ | కారుములక చెట్టుకాడ,
కాముడేమన్నా డేపిల్లా?
కరణంగారింటికాడ | కన్నిమామిడి చెట్టుక్రింద
కాసులు పేరిస్తానన్నాడమ్మా !
మునసబుగారింటి కాడ ! ముందల దరవాజు కాడ
ఆతడేమన్నాడే పిల్లా?
మునసబుగారింటికాడ | ముందలదరవాజులోన
ముక్కు పుడకలిస్తా నన్నాడమ్మా !