ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లోనే రెడుపండు - అరచేతులుండుగ
పసిపింద కొరికినా - ఫలమేమిరాజా
        బాలరో నేచిన్న దాన్నిరా
        చెలియరో నేచిన్న దాన్నిరా
తుమ్మెదలు చెలరేగి - దూలాలు తొలవంగ
మొగసాలి కేమన్న - మోసమారాజా
        బాలరో నేచిన్న దాన్ని రా
        చెలియరో నేచిన్న దాన్నిరా