ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపాయి

——వీడు కుంటెనకాడు. ఆమె అనురక్త. ఏదోరీతిని సంతుష్టి పడు నేమోనని మోగించు చున్నాడు.కాని నాణెము ఓటిది కాదు.

రూపయి కావాలా
రూపయి చిల్లర కావాలా
రూపు రేక నల్లగుంటె
రూపయెందుకు రూపయిసిల్ల రెందుకు
నానలజీలకరి మొగ్గ
పావల కావాలా
పావలడబ్బులు కావాలా,పిల్లా
పాదాలు సల్లగుంటే
పావలెందుకు పావలడబ్బులెందుకు
నానలజీలకరి మొగ్గ
సీరలు కావాలా, సిలుకు
సీరలు కావాలా, పిల్లా
సిరిగల నీ మోము సూత్తె
సీరలెందుకోయి బావ
సారెలెందుకోయి బావ, నలజీలకరి మొగ్గ