ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోరగారు

——ఈపాట నుడిందృశ్యము మారి రావలసి వచ్చినది. ఇక కేవలము వయసూవలపూ, మాత్రమే పాటలకు వాహనములు. సంఘ నియమములు తెగువలేని వారికి, వీరంతా తోక చుక్కలు. ఈ పిల్లను చూడండి, ఇప్పుదిప్పుడే కళ్లు తెరుస్తున్నది.

ఆద్ద సేరు బుక్కాకొని
వంగి కీసల బోసుకోని
ఎగిరి ఎగిరి సల్లాబోతడే నా దొరగారు
ఎవరి మీద నల్లాబోతడే నాదొరగారు ౹౹ఎ౹౹
పావు సేరు బుక్కాకొని
వంగి కీసల బోనుకోని
పైకిపైకి నల్లాబోతడే నాదొరగారు
ఎవరి మీద సల్లాపోతడే నాదొరగారు ౹౹ఎ౹౹
దొరసాని మీద సల్లాబోతడే నాదొరగారు
దొరసాని మీద సల్లాబోతడే ౹౹ఎ౹౹