ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలచిన చిన్నవాడు

——ఇటువంటి నాయికయే వలపుకాడు కిమరించి మాయమైనందుకు విలపించుచున్నది.

వాడు; వలచినాడమ్మా!
      నను తలచినాడమ్మా! ...చందమామోయ్!

వాడు; వలచీనా! తెల్లారి;
      పిలచినా! పలుకడు! ...చందమామో!

వాడు; పిక్కల సన్నంపు.
      బిగువైన మగవాఁడు; ...చందమామో!

వాడి; భుజాన ఉన్నది;
      భూచక్ర కంబళి; ...చందమామో!

అది; పదిగళ్లు భూటుపై
     పరచినా చాలమ్మా! ...చందమామో!

వాడి; మునిపళ్ల సందున,
     ముత్యాలు తాపింతు; ...చందమామో!

వాడి; పళ్కాన ఉన్నది;
      పచ్చలపిడి బాకు; ...చందమామో!

అది. ఎదలోన ఒకసారి
     అదిమినా చాలోయి; ...చందమామో!

వాడు; వలచినా దాకాను
      వలపోసి తిరిగాడు; ...చందమామో!

వాడు; వలచినా తెల్లారి
      పిలచినా పలుకడు; ...చందమామో!