ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీ చీరె నీకీయ్యనే గంగి
నీవోల్లకు కొయ్యవోనియ్యనే "
బండమీద బండలంటివి గంగారాం
బంగారు తలుపంటివి "
బండమీద బండఏది "
బంగారు తలుపేది "
ఈదుల్ల ఇల్లంటివి "
ఇద్దరికి జోడంటివి "
ఈదుల్ల ఇల్లేది "
ఇద్దరికి జోడేది "
గుట్టమీద గుడిసంటివి "
గురిజాల తలుపంటివి "
గుట్టమీద గుడిసేది "
గురిజాల తలుపేది "
ఇంటనే బాయంటివి "
ఇద్దరికి జోడంటివి "
ఇంటనే బాయేది "
ఇద్దరికి జోడేది గంగారాం

గంగారాం ఆటకట్టుబడినట్లున్నది. తోసిరాజైన ఏమిచేయగలడు? ఎక్కడా మొగమాటము లేదు గంగికి.