ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయింటి యీయింటి పెరుగమ్మా
పెరుగు గిరుగమ్మ నాకంత పెరుగమ్మా
పెరుగుగల్గినా సిన్నోడా నీకు
పాలేడ కద్దురో సిన్నోడా?
ఆవులా మేపే బాలన్నా బాల
గీలన్న నాకంత పాలన్న
పాలు గలిగినా సిన్నోడా నీకు
వక్కేడ కద్దురా సిన్నోడా
అడవిలోపొయ్యే నక్కన్నా
నక్క గిక్కన్ననాకంత వక్కన్నా
వక్కగలిగినా సిన్నోడా నీకు
ఆకేడ కద్దురా సిన్నోడా?
ఆకసానపొయ్యే కాకమ్మా
కాకి నేకమ్మ నాకంత ఆకమ్మా
ఆకుగల్గినా సిన్నోడా నీకు
నున్న మేడ కద్దురా సిన్నోడా ?
ఆయింటి యీయింటి సూరమ్మా
సూరగీరమ్మ నాకంత సున్నమ్మా
సున్న మూగల్గినా సిన్నోడా నీకు
పొవ్వాకు ఏదిరా సిన్నోడా?
సెట్టుమీదావుండె పిట్టన్నా
పిట్టగిట్టన్న నాకంత మట్టన్నా,

191