ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్దుల బావ

——ఇదేదో రెండుమూడు పాటలు కలిపి కుట్టిన బోంత. ఒకటి గారడీవాని పాట లేక, ఓడపాట. రెండోది 'రాతిరి పన్నెండు గంటలకు కాను తిరిగి నేనువస్తే' అన్నది. రెండోపాటది, 'రమణి ముద్దులగుమ్మ ' ? అన్నదే ప్రచారము గల పల్లవే. పూర్తి పాట మాకు లభించలేదు. ఇక్కడ ఇచ్చిన ఈ పాట "ఫరవాలేదు" అనిపిస్తున్నది. ప్రేయసీ ప్రియులు లేచిపోవుట పాటకపు జనములో గలదు. ఆ సందర్భమునకిది ఉదాహరణము,

ముద్దుల బావా ! ఓ ముద్దులబావా!
నారాజా నారాజ | నా రాజనిమ్మలపండు
నా ఒప్పురాలకుప్ప | నా అచ్చావుపాలు
నా అప్పుడు కాచిన్నేయి | నా ఆప్పడాలకఱ్ఱ
నా అంటుమామిడి గున్నా | నా జంటయీడకుంటావా ౹౹ము౹౹
రమణి ముద్దుల గుమ్మా | ఓ ముద్దులగుమ్మా
నారాణి నారాణి ! నారాణి ముద్దులగుమ్మ
నా; గజనిమ్మ పండు | నా ఆవకాయబద్దా
నా; అప్పడాల పీట | నీయబ్బ మీద ఆన
నిన్నిడిసి నిముసముంటానా | ముద్దులగుమ్మా ౹౹ర౹౹
మనసంటే ఎంతవరకో | మాటంటే ఎంతనిరుకో
వైన మేమీ తెలియకుండ | వాసివన్నె చూడకుండ
ఉన్నవూరు లుంటేను | విన్న వారునవ్వతారు
మన మేవూరుపోదామో | ముద్దులబావా!
చిలకా గోరింకలముగా | కలసి మెలిసి ఉందాము ౹౹ము౹౹

183