ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూవుల కథముగట్టి చిలుకగుఱ్ఱములుగట్టి
       పోయివత్తము గాలివీధిని పదరా
పూలతోటి బుట్టగట్టి - బుట్టకు ముత్యాలు చుట్టి
       బుట్టలోనె యెగిరి పోదముపడరా
అమృతప్రవాహమైన ఆకాశగంగలోన
       సరిగంగాలాడుదాము పదరా

7


నీ మొగము చందమామ-నీకళ్లు కలువపూలు
       నా మొగము తోటిచేర్చిపోరా
నీనోట నున్నమురళి నానోటనుంచి చూడు
       నేనొక్క పాటపాడెద వినరా
మధువూనీ మోవితేనె అదిరా నే నానియాని
       మతిమాలి సొక్కి సోలితి గదరా
నీవొక్క హంసమైతే నేను మానసమగుదు
       పన్నీట నిదురబుత్తును గదరా

8


తేట పన్నీటిలోన నీటుగాను జలకమాడి
       మధుర నీరూపుచూపను పదరా
మధురా నీగుండెలదరా-నిదుర కంటికిరాదు
       రెండు కొండ లడ్డమాయె గదరా

180