ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెరుమాళ్ల చిన్నా

——ఈ పాటలోని నాయిక ప్రొడ. అన్ని ఉపాయములూ ఆమేగారే చెపుతున్నది ఏ అపాయము వచ్చినను పైయెత్తు ఆమె ఊహలో ఉండనే ఉన్నది, ఏరువస్తే యీది పోదామనే చెలిమికత్తె ఈమె.

ఈపాటలోని చరణములు మాత్రమే సత్యములు. వాటివరుస, సంఖ్యకాక పోవచ్చును.

కొత్తకుండ నీరుతీపి, కోరినమగవాడుతీపీ
వాడినా చెఱకెంత తీపబ్బీ పెరుమాళ్ల చిన్నా
పదరా బందారు పోదాము,
నీకు నీవారు లేరు, నాకూనావారు లేరు
ఏటి యోడ్డున ఇల్లు కట్టబ్బీ, పెరమాళ్ల చిన్నా
ఏరువస్తే కూడబోదాము
చెంపనాసంపంగినూనె అంచునా చెంగల్వ మొగ్గ
ఏటివడ్డున యిల్లు కడదాము
బావిలోపల బల్లి పలికె బన్నసరమూ కొలుకులూడె
బిళ్లలా మొలత్రాడు తెగెనబ్బీ
పెరమాళ్ల చిన్నా
ఏరువస్తె ఈది బోదాము
ఆకసాన ఆకుతోట యంత్ర మధ్యన పూలతోట
పూలతోటలొ బండ్ల బాటమ్మి పెరమాళ్ల చిన్నీ
బండ్ల బాటలొ మంచి మాటమ్మి ౹౹

175