ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారాయణమ్మ

——రంగము వేళ్ళే కూలివారు నేటికీ చాలామంది ఉంటారు. రంగములో కూలి ఎక్కువ. కాబట్టి కూలీలు తరుచుగా పోతుంటారు. వారి భార్యలకిది కష్టకాలము; చెలిమికత్తెలకింకా ఎక్కుప. ఇది ఒక జంట సంభాషణ.

నేరంగమెల్లి పోతానే నారాయణమ్మ
నేను నబ్బ రెల్లిపోతానే నారాయణమ్మ
నువు సబ్బరెల్లి పోతేనూ నాయుడుబావ నీ
యబ్బనాకు తోడెవరూ నాయుడుబావ
రంగమెల్లిపోతేనూ నారాయణమ్మ నీకు
రంగుసీరలంపుతానే నారాయణమ్మ బల్
సిలుకు సీరలంపుతానే
సీరలు సారెలుగట్టి నాయుడుబావ నే
నోరితోను కులుకుతాను నాయుడు బావ.
పదిరాళ్లు తెస్తాను నారాయణమ్మ
మనమిద్దరము కులుకుదాము నారాయణమ్మ
నన్నిడిసిపోకోయి నాయుడుబావ మన
కిద్దరికి జోడోయి నాయుడుబావ

ఇది సాగని మొర. సొమ్ము చాలకనో నారాయణమ్మపై మోజు చాలకనో నాయుడుబావ రంగము వెళ్ళి పోతున్నాడు. ఆఖరి క్షణములో ప్రయాణము ఆగబోతుందా ?

152