ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాలుమాలి

కాలుమాలి జాలుమాలీ
జాలికవో బేడిజిల్లా
కాకినాడ రేవులోను జాలుమాలి
జోడుకొయ్యెల వోడవచ్చె జాలుమాలి
వోడమీద సిన్నవోడ జాలుమాలి
యేళ్ళనిండ వుంగరాలు జాలుమాలి
వుంగరాల సెయ్యి సూచీ జాలుమాలి
వుండదేర ముండమనసు జాలుమాలి

ఈ పాటలో 'జాలుమాలి' అన్న పదమును కళాసీలందరూ చేరి పలుకుతారు. మాటలు పదము చెప్పేవాడు చెప్పుకుంటాడు. ఈ పాటలో కథ అల్లిక కనబడుతున్నది. పడవను విడిచి పాట ఓడను పట్టినది. ఓడలో ప్రయాణీకులు పెక్కురు.

150