ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీకటిలోన

——ఈపాట పైదానికి అనుకరణవలే కనపడుతున్నది. కాని దీని సొగసు దీనిది.

చీకటిలోన వానచినుకు చిట్ పట్
ఆకుచాటు ఆడపిల్ల చట్ ఫట్
పూతపూచె బొండుమల్లె గప్ చిప్
కోతకొచ్చె గొడ్డుమావి చల్ చల్
వేళగాని వేళవచ్చి చిర్ బుర్
మేలమాడి నవ్విస్తాడు బల్ బల్
కోడెవాడు కొంటెవాడు ఆంయి ఆంయ్
రానిదాన్ని రమ్మంటాడు సంయ్ సంయ్

145