ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొర్రే గొర్రె

పోట్టేళ్ళ గన్నతల్లి గొర్రే గొర్రె
దున్నపోతును గన్నతల్లి బర్రేబర్రె
వుమ్మెత్త కాయతింటే వెర్రే వేర్రె
మిరపకాయ నమిలితేను వర్రేవర్రె
కాకి రెట్ట బట్టమీద కర్రేకర్రె
బురదలోను కాలేస్తె పుర్రేపుర్రె
ముందటి పండ్లూడి తోర్రేతోర్రె
తొర్రె నోట్లా అంబలేస్తే జుర్రేజుర్రె

"చద్దీవణ్ణం వుల్లిపాయా జుర్రోజుర్రో, దానీ మొగుడు దాన్నీ కొడితే మొర్రో మొర్రో", అన్న పాటలా గున్నది ఇది.