ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడికోపు

——ఈ నాలుగుపాటలూ కేవలము వినోదములో పుట్టి వినోదమునకు దారితీశేటివే,

తానతందాన తాన, తక్కిడీ తందానతాన

పచ్చపచ్చని పక్ష్మి యొక్కటి, నడీ నెత్తిని రెక్కలొచ్చె
చేతులాను గోళ్లువచ్చె, చెవుల సందున కొమ్ములొచ్చె౹౹

దాని పచ్చిమాంసమును, కత్తిపీటన కోసికోసి
బ్రాహ్మలనక బంటులనక, బంతినీ భోంచేసిరంట౹౹

ఎంత చెప్పిన వేదశాస్త్రం, తెలియదాయెను దానిభావం
దానిభావం బట్టబయలు, దాని పేరే అరటి చెట్టు౹౹

సందెకాడ లగ్గమాయె, సానిపొత్తు గర్భిణాయె
తెల్లవారగ పిల్లతల్లి, పొద్దుపొడుపుకు పేరుకొచ్చె ౹౹తా౹౹

ఎంత చెప్పిన వేదశాస్త్రం, తెలియదాయె దానిభావం
దానిభావ బట్టబయలు, దాని పేరే పెరుగుకుండ ౹౹తా౹౹

ఇంటి వెనక కుప్ప వేసె, కుప్పకాల అప్పుతీరె
ఎంత చెప్పిన వేదశాస్త్రం, తెలియదాయె దానిభావం
దానిభావం బట్టబయలు దానిపేరే కుమ్మరావం ౹౹తా౹౹

ఇది తకిటకిటతక అని ఏడక్షరాల ఆవృతాలతో నడుస్తున్నది. కోవులన్నవి సాధారణముగా నాలుగక్షరాల ఆవృతాలతో నడుస్తవి.

142