ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతమునులునూ చందమామ | అక్కడికి వచ్చిరీ చందమామ
కవిలగాల వులునూ " కశ్య పాంగిరసులు "
అత్రి వశిష్టులు " ఆకన్నియను జూచి "
బ్రతుకుగనె యీతల్లీ " బ్రతుకమ్మ యనిరంత "
పిలుతు లదివరనుండి " ప్రియముగా తలిదండ్రి "
బ్రతుకమ్మ యనిపేరు " ప్రజలంత అందరూ "
తాను ధన్యూడంచు " తనబిడ్డతో రాజు "
నిజ పట్టణము కేగి " నేల పాలించంగ "
శ్రీ మహా విష్ణుండు " చక్రాంకు డనుపేర "
రాజు వేషంబున " రాజు ఇంటికి వచ్చి "
ఇల్లంట మనివుండి " అతివ బ్రతుకమ్మను "
పెండ్లాడి కొడుకులా " పెక్కు మందిని గాంచె "
ఆరువేల మంది " అతి సుందరాంగులు "
ధర్మాంగుడను రాజు " తనభార్య సత్యవతి "
సరిలేని సిరులతో " సంతోష మొందిరి "
జగతి పై బ్రతుకమ్మ చందమామ | శాశ్వతంబుగ వెలసె చందమామ

116