ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరునాళ్లు

—— తిరునాళ్లకు పోవటముతో సరికాదు. అక్కడ చిక్కులెన్ని ? తిరిగి వచ్చే వరకు తీర్దపు తీట తీరిపోతుంది,

ఎల్తే ఎల్దువుగాని ఎంతో జాగ్రతయమ్మి
చిన్న దాన్నైయుండి చిన్నామామయ్యతో
చక్కా దానాలనూ చెన్న కేశవుల
తిరునాళ్ల నే బోయి తీర్ధామాడినాక
టెంకాయనే కొట్టి దీపమెలిగించి
ఉల్లడం క్రిందుగా ఊరేగుతుంటే
చిలిపివాడెవ్వడో చిన్నం గెన కొచ్చి
సంకాలా చెయిపెట్టి సరసమాడేడే
ఎనక్కి చూసే తలికి యెల్లీ పోయినాడే
మాచెర్ల చెన్నడే మాయల్లవాడే

వాడెవడైనా మాచెర్ల చెన్నడే అనుకోవటములో అందమున్నది కదా ! చెన్న కేశవుని ఉత్సవానికి వెళ్లి నీదాయెను. ఆ చిలిపి వాడెవ్వడు కాగలడు ?

112