ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నే నెరుగ నే నెరుగ నీభర్త నడుగు
రచ్చలో మెలిగేటి రాజేంద్రభోగీ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార
పెట్టుకో సొమ్ములు కట్టుకోచీర
పోయిరా సుఖముగా పుట్టినింటికిని

ఎంతసుఖమైన హుకుము ! రచ్చలో మెలిగేటి రాజేంద్రభోగి ఉత్తరాంధ్రసీమ గేయాలలో రెండుమూడు తడవలు కనబడుతాడు.

సరిగ్గా యిటు వంటి పాటయే రాయలసీమ పొటలలో ఒకటున్నది.

పట్టెమంచంమింద పండుండె మామా
అందరూబోతారు నందితిరణాళూ స్వామితికణాళూ
నన్నేమియడిగేవు మీయత్త నడుగే
గద్దెపీటలమింద గౌరి పెద్దత్తా
అందరూబోతారు నందితిరణాళూ స్వామితిరణాళూ
రచ్చకట్టలమింద రాజా పెడబావా
అందరూబోతారు నందితిరుణాళూ స్వామితిరుణాళూ
వంటసాలలనుండె వయ్యారి అక్కా
అందరూబోతారు నందితిరణాళూ స్వామితిరుణాళూ
ఎద్దూలగాసేడి ముద్దూల మఱదీ
అందరూబోతారు నంది తిరుణాళూ స్వామితిరుణాళూ
సూదులో ఉండేటి ఓ మొగలి రేకా
అందరూబోతారు నందితిరుణాళూ స్వామితిరుణాళూ

రచ్చలో మెలిగేటి రాజేంద్రభోగికీ, సూదుల్లో వుండేటి మొగలి రేకుకీ తారతమ్యమున్నది గదా ! అది హుకుములో కూడ కన్పిస్తున్నది. ఈతడు వల్ల గాదన్నాడు.

111