ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏలలు యక్ష గానాల్లో గానీ, వీధినాటకములలో గాని, స్త్రీల పాటలలో గాని ఉన్నప్పుడు వాటికి ఇదే లక్షణము. అప్పకవి తక్కిన దేశీఛందములను వివరించునప్పుడు వలెనే ఏలల వివరించునప్పుడును పప్పులో అడుగునై చినాడు. 'భానువంశ మూనబుట్టి' అన్న కందు కూరి రుద్రకవి ఏలను 'తకిట తకిటా అని త్రిశ్రగతిలో పాడుకున్ననూ పొడుకోవచ్చును. ఏల యొక్క గతి, రెండూ నాలుగు అక్షరాలుగా తెంపిననే నిర్దుష్టముగా స్ఫురించగలదు ఈ ప్రత్యేకతను చెప్పకుంటే వేరేది చెప్పినను ఫలము లేదు.

ఏలపాటలు రాయలసీమ జానపద గేయములలో మిక్కుటము. అందువల్లనే కదిరీపతి "వీధిబోయెడు ప్రౌఢ విటుడు పాడెడువింత ఏలపదాలట్టే యాలకించు” నన్నాడు. వీటిలో పాటకు ప్రాధాన్యత హెచ్చు, తెలుగు జానపద గేయములలో సంగీత మాధుర్యము రాయలసీమ పాటలలోనే హెచ్చు,

96