ఈ పుట ఆమోదించబడ్డది
అను_____అన్న 65 అన్న____అన్న
మే మనగలం? అనువు గానిచోట అధికుల మనరాదు అని నోరుమూసుకొని కూచోవలిసిందే." వా.
అనువు దప్పు
- పస చెడు.
- "అనువు దప్పిరి నొచ్చి రలసి రాపద నొంది, రదపద లైరి చీకాకుపడిరి." హరివి. 3. 10.
అనువుపఱచు
- అమర్చు.
- "అఱుత రుద్రాక్షమాలిక లనువు పఱచి." కాశీ. 1. 95. శివ. 3. 12.
అనువొందు
- ఏర్పడు.
"మనుజాధిపదనుజాధిపు లనువొందిరి
రామ రావణా కారములన్."
శకుంతలా. 3. 135.
అనుష్ఠానము తీర్చు
- సంధ్యావందనాదులు నిర్వర్తించు.
- "స్నానంబు సేసి నిజక, ర్మానుష్ఠానంబు దీర్చి." కా. మా. 119.
అన్కను కగు
- మెత్త మెత్త నగు, ద్రవీభూతమగు.
"అరుణకరోత్క రాభిహతి నన్కను
కయ్యెడు సాంద్రచంద్రికాంతరమున."
కుమా. 8. 182.
అన్న గళు
- అన్న గార్లు.
- కంచుకి మొద లయినవారు.
- తమి. "అన్నగళ్."
- "అన్నగళు మాట..." మన్నారు. పు. 4.
అన్న చొరవ
- తినుటలో ప్రావీణ్యము.
- "వాడికి అన్న చొరవే కాని అక్షర చొరవ లేదు. ఏంలాభం?" వా.
అన్న చొఱవే గాని అక్షర చొఱవ లేదు.
- విద్యాగంధం లేనివా డనుట.
- "వాడికి అన్న చొఱవే గాని అక్షర చొఱవ లేదు." సా.
అన్నట్టు
- వాక్యోపస్కారకము.
అన్న తర్వాత
- అయినప్పుడు...
- "మొగు డన్న తర్వాత ఆ మాత్రం దండించకుండా ఉంటాడా?" వా.
- "ఉద్యోగ మన్నతర్వాత ఏవో కొన్ని నిర్బంధాలు లేకుండా ఎట్లా ఉంటాయి." వా.
అన్న దమ్ము లగు
- సమాన మగు.
- "క్రేగంటిచూపున గిఱికొన్న సన్న గే దంగిఱేకుల కన్నదమ్ము లగుచు." ఉ. హరి. 1. 151.
అన్నన్న
- ఆశ్చ ర్యార్థకము.
- నేటికీ యిది వాడుకలో నున్నది.
"కొన్నంగడిలోపలనే, యన్న నా!
మాఱుబేర మగునే చెలియా!"
రాధి. 3. ఆ. 22 ప.
అన్న ప్రాశం
- పిల్ల లకు తొలిసారిగా అన్నము పెట్టుటకై చేయు సంస్కా