ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జిల - జిలి 842 జిలు - జిహ్వ

జిలజిల మను

  • 1. చెమ్మగిలుటలో ధ్వన్యనుకరణము.
  • "జిలజిల మంచుఁ జెమ్మగిల." రాధి. 3. 110.
  • 2. వ్యాపించుటలో ధ్వన్యనుకరణము.
  • "జిలజిలన వడిసె వెన్నెల, జిలజిల దిక్కులకు నొడిసెఁ జీఁకటు లెడసెన్." రంగా. 3. 187.

జిలమబుడతలు

  • ధాన్యవిశేషం.

జిలితొగల రాజనములు

  • ధాన్యవిశేషము.

జిలిబిలి

  • 1. మనోహర మయిన.
  • "తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో, జిలిబిలిపాట ముద్దులు నటింప." మను. 2. 27.
  • 2. ఒక నగ.
  • 3. ఇంపైన, ముద్దు ముద్దయిన.
  • 4. అంద మైన.
  • 5. చిన్న దైన.

జిలిబిలి చీర

  • చిన్న చిన్న గళ్ళున్న సన్నని పట్టుచీర. శ. ర.

జిలిబిలి వోవు

  • 1. ఒప్పు.
  • 2. తొట్రుపడు. నైష. 7. 103.
  • 3. ఎక్కు వగు. విక్ర. 4. 224.

జిలుగక్షరాలు

  • గొలుసుకట్టు వ్రాత.
  • "ఆ పత్రంలోని జిలుగక్షరా లీకాలం వాళ్లు ఎవ్వరూ చదవ లేరు." వా.

జిలుగువన్నెలు

  • వస్త్రవిశేషం. యయా. 4. 122.

జిలుగువ్రాత

  • గొలుసురాత.
  • చూ. గొలుసురాత.

జిలుబారు

  • అంద మయిన.
  • "చెలికత్తె జిలుబారు పలుకుఁ జిలుక." నైష. 1. 5.

జిల్లేడుకాయలు

  • ఒక పిండివంట పేరు.

జివ్వంకలు వంగు

  • జివ్వున జివ్వున ఆడుతూ వంగిపోవు.
  • "నెవ్వలి సన్నుల వ్రేఁగున, జివ్వంకలు వంగఁ గౌను." కుమా. 9. 113.

జివ్వాడు

  • జివ్వు జివ్వు మని కదలు.

జిహ్వ ఆడక

  • నాలుక ఆడక, మాట రాక.
  • "యెవ్వతె నంచును జిహ్వయాడ కంత్యంతముఁ దొట్రిలం బలికె." కళా. 6. 131.