ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జడి - జడ్డి 825 జడ్డి - జత
- "జడిగొని సమ్మదాశ్రుకణజాలము లొల్కఁగ." పారి. 3. 5.
- చూ. జడి పట్టు, జడివాన.
జడిగొలుపు
- జడిగొనునట్లు చేయు.
- "మిగుల బిరు సగుశరముల్, జడిగొలిపి తద్బలంబుల, మడియింపఁగఁ జొచ్చె మారి మసఁగినభంగిన్." జైమి. 5. 56.
- చూ. జడిగొను.
జడి పట్టు
- 1. ముసురు పట్టు.
- "మరీ జడిపట్టి కురుస్తూంది." వా.
- 2. పట్టు పట్టు.
- "తడఁబడక తప్పు లాడక, జడి పట్టక పరుసు గాక...మాటాడ వలయు." సకల నీతి. స.
జడి పెట్టు
- భయపెట్టు.
- "విడువక జడిపెట్టు విసిగి యల్లమయు." ప్రభు. 2. 32. పు. కాశీ. 4. 50.
- రూ. జడి వెట్టు.
జడివాన
- వదలకుండా ముసురు పట్టి కురిసే వాన.
- "క్రొవ్విరి జడివాన కుంభినిఁ గురిసె." రంగా. రా. బాల.
జడివెట్టు
- "....వృధాలాప ప్రబంధోక్తులన్, జడివెట్టం బని లేదు." కాశీ. 4. 50.
- చూ. జడిపెట్టు.
జడ్డిపెట్టె
- నడుమ బరువు కట్టి ఇద్దరు మనుషులు మోసుకొని పోవుటకు ఉపయోగించే పొడుగైన కఱ్ఱ - జడ్డి. దానికి కట్టిన పెట్టె - జడ్డిపెట్టె. బ్రౌన్.
జడ్డియీటె
- నడుమ పిడిగల యీటె. బ్రౌన్.
జడ్డుతనము
- మాంద్యము; సోమరితనము.
జడ్డుపడు
- అలస మగు.
- "జడ్డుపడి యుండె నొక కొంత ప్రొద్దు వేడ్క." శివ. 1. 64.
జడ్డుమనిషి
- సోమరి.
- "వాడు వట్టి జడ్డుమనిషి. వాడితో పెట్టుకుంటే ఏ పనీ కాదు." వా.
జడ్డు వడు
- వెనుక పడు.
- జడ్డు-జడత, మాంద్యం-జడ్డుమనిషి-సోమరి, అలసుడు అనే అర్థంలో నేటికీ వాడుకలో ఉన్నది. పండితా. ప్రథ. దీక్షా. పు. 178.
జతకట్టు చేయు
- సన్నాహపఱుచు.
- "చతురంగబలమున జతకట్టు చేసి." వర. రా. సుం. పు. 156. పం. 5.