ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చెన - చెన్న 769 చెన్న - చెప్ప
చెనకి యాడు
- కొట్టు.
- "గొబ్బు గొబ్బునఁ జేతికి, నబ్బినకైదువులఁ జెనకి యాడినఁ జెనకుల్." కకు. 1. 181.
చెనటిప్రతిజ్ఞలు.
- కఠినప్రతిజ్ఞలు. హరిశ్చం. పూ. 404. పం.
చెనటిమాటలు
- వ్యర్థము లైన మాటలు.
- "అనుచు వగచు పలుకు లాలించి భీష్మాది, యోధవరులలో సుయోధనుండు, చెనటిమాట లేమి వినియెద రనిన..." భార. భీష్మ. 2. 228.
చెనుపరిమాటలు
- పల్లెటూరి మాటలు, మోటు మాటలు.
- "చెదరినకేశముల్ చెనుపరిమాటలు, వికృతస్వరంబునువెలయఁ గలిగి." భాస్క. రా. బాల. 593.
చెన్నటి పోవు
- వ్యర్థ మగు.
- "మీరును నే విచారములు మిన్నక చేయక పెంపు మీఱ నా, చేరువ రండు గెల్చుటను శ్రీయును గీర్తియు ముక్తియున్ మృతిం, జేరురణప్రయత్న విధి చెన్నఁటిపోవునె..." హరి. ఉ. 10. 123.
చెన్నలరారు
- ఒప్పు.
- "శ్రీహరి మిత్రుఁ డీ కృతికిఁ జెన్నలరార నధీశుఁడు." రుక్మా. 1. 15.
చెన్నలరు
- చూ. చెన్నలరారు.
చెన్నారు
- చూ. చెన్నలరారు.
చెన్నుపడు
- ప్రకాశించు.
చెన్నుపఱుచు
- ప్రకాశింప జేయు. బ్రౌన్.
చెన్ను మిగులు
- ఒప్పు. తారా. 2. 16.
చెన్ను మీఱు
- ప్రకాశించు.
- "తొడవు లూడ్చిన నైనఁ దొయ్యలి రూపుతోఁ, జిన్నపోయినపట్లు సెన్ను మీఱ." ఉ. హరి. 1. 57.
చెన్నె సలారు
- ఒప్పు. హరి. ఉ. 2. 128.
చె న్నొందు
- మనోహర మగు.
- "మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు." భాగ. స్క. 2. 228.
చెప్పక చెప్పక
- అనక అనక.
- 'చెప్పితే ఇంకెవరి నైనా చెప్పాలి గాని వీణ్ణా' అను భావచ్ఛాయలో...
- "చెప్పక చెప్పక పాండిత్యం విషయంలో వీణ్ణే చెప్పాలా? పొట్ట పొడిస్తే అక్షరం లేదు వీనికి." వా.