ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చెడ్డ - చెత్తా 768 చెద - చెన
చెడ్డయింటి చెదార మగు
- 1. సంస్కారము లేక, చూచే దిక్కు లేక గాలికి పెరుగు. కాశీ. 4. 91.
- 2. ఎవరి పోషణా లేక తనకు తానుగా పెరుగు.
- "చెడ్డ యింటి చెదార మై శివుని కరుణ, నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్నుఁ దలఁచి." కాశీ. 4. 91.
చెడ్డ యొట్టు
- సరిపడని సంగతి.
- "కొఱపము చెడ్డ యొట్టు." హంస. 4. 41.
- చెడ్డ యొట్టువలెనే బహిష్కృత మనుట.
చెడ్డ సరదా
- ఎక్కువ సరదా. మాటా. 1.
చెత్తగొడుగు
- గడ్డితోనో, ఎండిన ఆకుల తోనో చేసిన గొడుగు.
- "జాఱు బొజ్జయు నునుదబ్బ సంబెళయును, జెత్తగొడుగును జక్కఁ దాల్చి." హర. 7. 12.
చెత్తాకానీ రకం
- చౌకబారు రకం.
- "వాళ్ల దంతా చెత్తాకానీరకం." వా.
- "ఈ చెత్తాకానీ రకం కుర్చీ లెక్కడ దొరికాయి రా." వా.
చెత్తా చెదారం
- చెత్త. జం.
- "ఈ చెత్తా చెదారం అంతా తుడిచే సరికి నాలుగురోజు లవుతుంది." వా.
చెద పట్టిన
- పాత పడిన; చెదలుపట్టి పాడయిన. నిరసనగా అను మాట. జగ. 117.
చెదపురువునుంబోలె విదలించు
- నీచముగా చూచు.
- "ఆకటఁ గటకటంబడి గ్రాసంబు వేఁడినఁ జెద పురువునుంబోలె విదలించు వారలే గాని యాయాసం బెఱింగి ర మ్మనువారు లేరు..." శుక. 3. 187.
చెదరబడు
- చెదరి పడు.
- "రాలిన భూషణాలిఁ జెదరంబడి యున్న శతాంగకోటినా,భీలత నొందె నారణము." భాస్క. రా. యు. 1. 182.
చెదర బాఱు
- 1. వ్యాపించు.
- "చెదరం బాఱు దశప్రభంజనములన్ శిక్షన్ సుషుమ్నంబునన్, గుదియం బట్టి." సర్వే. శ. 48.
- 2. చెదరి పడు. చంద్రా. 5. 68.
చెనటి పిసాళి వెచ్చములు
- దుర్వ్యయములు, దుబారా ఖర్చులు.
- "...అనృతోప పన్నమున్, జెనటి పిసాళి వెచ్చములఁ జేర్చుచు...." పాండు. 3. 19.