ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుంచు - చుక్క 743 చుక్క - చుక్క

చుంచుకుఱ్ఱ

  • చిన్న వాడు.
  • "ఇల్లొకపట్టునం గడచి యేఁగగ నేరని చుంచుకుఱ్ఱలన్." అచ్చ. రా. బా. 104.

చుంచుమిద్దె

  • ముందుకు చుంచులు వచ్చు నట్లుగా కట్టిన మిద్దె.

చుంచుఱాయి

  • మిద్దె కైన పలకఱాయి. బ్రౌన్.

చుంచెలుక

  • చుంచు.
  • రూ. చుండెలుక.

చుండ్రాళ్ళు

  • ఒక పిల్లల ఆట.

చుక్కకాడ

  • మాగాణిలో మొలిచే ఒక మొక్క. బ్రౌన్.

చుక్కచేరు

  • నుదుట వ్రేలాడగా తలపై ఉంచే నగ.

చుక్క తెగి పడినట్లు

  • అకస్మాత్తుగా.
  • "...అంతం జుక్క తెగి పడిన వడువున నెక్కడ నుండియో యాకస్మికంబుగ నింటికిం జలిఁది వంటకంబుఁ గుడువం జనుదెంచి." పాండు. 3. 24.

చుక్కబొట్టు

  • చుక్క.

చుక్కయెదురు

  • ప్రతికూలము; చెడు కలిగించునది.
  • జ్యోతిశ్శాస్త్ర రీత్యా వచ్చిన పలుకుబడి.
  • "శుక్రుడు ఎదురుగా ఉండగా ప్రయాణాదులు చేయరా దని తచ్ఛాస్త్రవిధి. తద్వారా ప్రతికూల మనుటగా మారినది.
  • "దైత్యావరోధనదయితాధరములతో, సొబగువీడెములకుఁ జుక్కయెదురు." ఉ. హరి. 3. 147.
  • చూ. ఎదురుచుక్క, చుక్కెదురు.

చుక్కలను జూచి కుక్కలు మొరిగినట్లు

  • గొప్పవారిని చూచి నీచులు ఆడిపోసుకొన్నా, దూషించినా లెక్కేమిటి అనుట. శరభాంక. 47.

చుక్కలు గోరాడు

  • మిన్నంటు.
  • "చుక్కలు గోరాడు సున్నపు మేడలు." వర. రా. అయో. పు. 323. పంక్తి. 6.

చుక్కల్లోకి చూచు

  • గర్వమును ప్రదర్శించు. కొత్త. 14.

చుక్కవాలు

  • ఎదురుచుక్క.
  • విరోధి అనుట.