ఈ పుట ఆమోదించబడ్డది
అడు_____అడు 46 అడు_____అడు
అడుగున పడు
- విస్మృత మగు.
- "వాడు కౌముది అంతా చదువుకున్నాడు. కాని అది అంతా యిప్పుడు అడుగున పడి పోయింది." వా.
- "నా అర్జీ అడుగున పడి పోయింది. విచారించేనాథుడు లేదు. వా.
అడుగుపఱచు
- తక్కువపఱచు.
- "లలి గొ ప్పెక్కించితి మధుపుల, శుకులను నడుగుపఱచి పుష్పాస్త్రా! మా,లలకును మంచంబులు బా పలకును బీట లనుమాట బళి నిజమయ్యెన్." చంద్రా. 5. 91.
అడుగు పెట్టకుండు
- ముందుకు సాగకుండు.
- "...ఎంత చేసిన నాసింహ మెదుటి కడుగు వెట్ట దయ్యెను." కళా. 3. 86.
అడుగు బట్టు
- మూలబడిపోవు, క్రిం దగు.
- "బలు సెక నించువి ల్లడుగుబట్టినదే యిపు డాకు బూదిగెంపుల ద్రిరుచిత్వ మూది." ఆము. 4. 96.
అడుగు బడుగు
- కుండలో ఆఖరున మిగిలినది.
- "కాస్త అడుగో బడుగో యేదో ఒకటి వేయం డమ్మా. ఆకలిగా ఉంది." వా.
అడుగుభద్రం<.big>
- నెమ్మది, నిదానం, పదిలం.
- "వాడు వట్టి అడుగుభద్రం లేనిమనిషి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు." వా.
- చూ. అడుగు లేనిగిన్నె.
అడుగు మాడు
- చూ. అడుగంటు.
అడుగుమనిషి
- పాదసేవకుడు.
- పాండు. 4. 304.
అడుగు మాలిపోవు
- నిర్మూల మగు.
- "అనుజ తనుజులు జెలులు వియ్యములు నడుగు, మారిసోదరు నీకు గా మనుజ నాథ!, దొరకు గులనాశనుం డనుదూఱు మేలె, పాండవులతోడ నొడ గూడి బ్రదుక వయ్య."
- భార. ఉద్యో. 3. 341.
అడుగు ముట్టా
- పూర్తిగా.
- "ఆవిషయం అడుగుముట్టా తెలుసుకునే దాకా వదిలిపెట్ట దలచుకో లేదు." వా.
అడుగులకు మడుగు లొడ్డు (లొత్తు)
- అతిభక్తితో సేవించు.
- పూర్వం ఎవరైనా గొప్పవారు వస్తే వారి అడుగులు నేలకు తగులకుండా ఉతికిన బట్ట పరచి దానిమీద నడిపించుకొంటూ వచ్చేవారు. అందుపై వచ్చినపలుకుబడి. ఇప్పటికీ కొందఱి పెండ్లిండ్లలోనూ, శ్రాద్ధాలలోనూ గౌరవసూచకంగా బట్టలు పఱచి నడిపించుట కానవస్తుంది.