ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చు_______అచ్చు 33 అచ్చు_______అచ్చు

అచ్చు పొడిచిన

  • అచ్చు పోసిన, స్వేచ్ఛాచారి అయిన.
  • "అచ్చు పొడిచిన యాబోతులరీతిని." ఆం. వా.
  • చూ. అచ్చువేసిన...

అచ్చు పొడుచు

  • చూ. అచ్చు వేయు.

అచ్చు పోసిన యాబోతు

  • చూ. అచ్చు పొడిచిన.

అచ్చుపోసి వదలు

  • విచ్చలవిడిగా వదలు.
  • "వాణ్ణి అచ్చు పోసి వదిలినారు. ఎప్పడూ ఊరు తిరుగుతుంటాడు." వా.

అచ్చు ముచ్చు

  • మంచి, చెడు.
  • బియ్యం మొదలయినవాట్లో మెరికలను ము చ్చని, మిగతవానిని అచ్చు అనేదృష్టితో అచ్చుముచ్చు ఏర్పరచి పెట్ట మనుట అలవాటు. అందుపై యేర్పడిన పలుకుబడి.
  • "చూడ వచ్చిన నచ్చుముచ్చో యెఱుంగ కాడరా దేల యా పాప మనెడువారు."
  • శుక. 4. 46. ప.
  • "బియ్యం తీసి అచ్చూ ముచ్చూ ఏరి పెట్టు తల్లీ." వా.

అచ్చు ముచ్చు ఎఱుగు

  • మంచిదో చెడ్డదో తెలుసుకొను.
  • బియ్యంలో అచ్చు లనగా మంచి బియ్యం మనీ ముచ్చు లనగా మెరికె లనీ అర్ధం.
  • అచ్చూ ముచ్చూ చేసి - అనగా బియ్యము వేఱుపఱచి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "అచ్చూ ముచ్చూ ఎఱగనివాడు పాపం." వా.
  • చూ. అచ్చు ముచ్చు.

అచ్చులు వెట్టించు

  • ముద్రవేయు.
  • "అమరారి దనపేరి యచ్చులు వెట్టించి సురధేనుసమితి గీలరము సే సె." కుమా. 4. 11.

అచ్చులొత్తు

  • అచ్చులు పెట్టించు.
  • "అందఱి మొగములయం దచ్చు లొత్తి యారిచి పెడబొబ్బ లందంద యిచ్చు."
  • బసవ. 192. పు.

అచ్చులో లేదు

  • ముద్రిత రూపంలో లేదు. అచ్చు అయిన వన్నీ అయిపోయిన వనుట.
  • "ఆ పుస్తకం యిప్పుడు అచ్చులో లేదు." వా.

అచ్చువడు

  • అంకిత మగు.
  • "భావజుకేళి నచ్చువడి పైబడి తద్విటు నిచ్చ గూడి." కుమా. 8. 158.

అచ్చు వేయు

  • ముద్రించు.
  • "ఈ పుస్తకమును అచ్చువేసి చాలకాల మయినది."
  • "దీనిని అచ్చువేసి పెట్ట మని చాల నాళ్లుగా అతడు అడుగుతున్నాడు. వా.