ఈ పుట ఆమోదించబడ్డది
అచ్చ_______అచ్చి 31 అచ్చి_______అచ్చు
అచ్చనపుచ్చు
- అచ్చనగాయవలె వేఱుగా తీసివేయు.
- "భాగుకన్నొక డచ్చనపుచ్చి." కు. 2. 19.
అచ్చనలాడు
- అర్చించు.
- "చెచ్చెర సుతుప్రాణ మిచ్చిన నేడ, యచ్చనలాడెద నభవుడా మీకు."
- పండితా. పురా. 471 పు.
అచ్చాకు బుచ్చాకులు పలుకు
- చూ. అచ్చికబుచ్చిక లాడు.
అచ్చాళు
- ఒంటరి.
- ఏబాధ్యతా, భారమూ, జంజాటమూ లేనివాడు.
- దక్షిణాంధ్రంలో ఈ పలుకుబడిని వాడుతారు.
- "అచ్చాళి గాగ అనికి సన్నద్ధుల మై యుందము." పతివ్రతా. 35.
- "వాడు అచ్చాళీగా తిరుగుతున్నాడు. దండించే దిక్కు లేదు కనుక." వా.
అచ్చిక బుచ్చిక మాటలు
- కల్ల బొల్లి కబురులు, ముచ్చటలు.
అచ్చిక బుచ్చికలు
- ముచ్చటలు.
- "అక్కఱ జూడ వేటి కల యచ్చిక బుచ్చిక సేయునంచలన్." విజ. 3. 30.
- "వాడు అక్కడికి వెళ్ళి అచ్చికబుచ్చిక లాడుతూ కూర్చున్నాడు. వా.
- "అచ్చిక బుచ్చిక లడర గొంతకాలంబు గడపి." హరి. 2. 69.
అచ్చికా మచ్చికా లేదు.
- ,ఉద్దూ ముచ్చటా లేదు అనుట. జం.
- "ఆ ఆలుమగళ్ళకు అచ్చికా మచ్చికా లేదు." వా.
అచ్చిక బుచ్చికలాడు
- కల్లబొల్లి కబుర్లు చెప్పు.
అచ్చి వచ్చు
- శుభప్రద మగు.
- కొన్ని తావులు కొందరికే అచ్చి వస్తాయనీ, అక్క డున్నప్పుడు ఎప్పుడూ మంచే కలుగుతుందనీ, కానప్పుడు కీడు వెన్నాడుతుం దనీ ఒక నమ్మకం. అందుపై వచ్చినపలుకుబడి.
- "ఆ యిల్లు మాకు అచ్చి వచ్చ్ంది. అంచేతే యెన్ని యిబ్బందు లున్నా అక్కడే ఉంటున్నాము." వా.
- "ఆ ఊరు మాకు అచ్చి రాలేదు. అందుకని తిరిగి వచ్చి వేశాము." వా/
అచ్చకట్టు
- ఏర్పఱచు - కట్టు.
- "నడవ యచ్చు కట్టిన మునిరాట్పట్టాభిషిక్తు." పాండు. 1. 11.
అచ్చుకట్టు పొలము
- అచ్చుకట్టు వేసినపొలము.
- చూ. అచ్చుకట్టు.
అచ్చుకట్టు వేయు
- నీళ్లు కట్టేముందు మడిని వేరు వేరు కయ్యలుగా చేయు.