ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాళ్ల____కాళ్ల 466 కాళ్లా____కాళ్లు
కాళ్ల జెఱ్ఱి
- కాళ్ళు చాలా ఉండే జెఱ్ఱి.
- "ఈ మధ్య ఎక్కడ బట్టినా కాళ్ళ జెఱ్ఱులు కనిపిస్తున్నాయి. కాస్త జాగర్త రా బాబూ! అవి చెవిలో దూరుతాయట." వా.
కాళ్ల పెనగు
- కాళ్ళమీద పడు.
- "కలికి నెఱివేణి చెలువంబు గాళ్ల బెనగ." విజయ. 2. 116.
కాళ్ల బేరమునకు వచ్చు
- లొంగి వచ్చు.
- కాళ్లు పట్టుకొనుటకు సిద్ధపడు.
- "గట్టిగా నిలబడితే వాడే కాళ్లబేరానికి వస్తాడు." వా.
కాళ్లమీద గంజి పోసికొను
- వెంటనే తొందరగా పోవాలని త్వరపడు.
- "వీడు ఎప్పుడు వచ్చినా కాళ్లమీద గంజి పోసుకొని వస్తాడు." వా.
కాళ్ల మీద పడు
- ఆశ్రయించు, ప్రాధేయపడు.
- "వాడు ఎలాగైనా యీచిక్కు తప్పించ వలసిం దని నా కాళ్ళమీద పడ్డాడు. ఏం చేస్తాం?" వా.
కాళ్ల రిగిపోవు
- ఎక్కువ తిరుగుటను సూచించేపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "ఆ పుస్తకంకోసం వాడిచుట్టూ తిరిగి కాళ్లరిగి పోయాయి." వా.
- "ఆ పుస్తకంకోసమని వాళ్లింటిచుట్టూ కాళ్లరిగి పోయేటట్టు తిరిగాను." వా.
కా ళ్లాడ లేదు
- 1. ఏమీ తోచ లేదు.
- "ఉన్నట్లుండి ఈ మాట తెలిసేసరికి నాకు కాళ్ళాడ లేదు." వా.
- 2. పోవుటకు మన సొప్ప లేదు.
- "ఈ అమ్మాయిని వదిలిపెట్టి పోవడానికి నాకు కాళ్లాడడం లేదు. పసిపిల్ల. కొత్తతావు." వా.
కాళ్లా వేళ్లా పడు
- బ్రతిమలాడు.
- "నే నెంత కాళ్లా వేళ్లా పడినా వాడు సాయంత్రందాకా ఉండ మన్నా ఉన్నాడు కాదు." వా.
కాళ్లు అరిగేటట్టు తిరుగు
- ఎక్కువగా తిరుగు.
- "కా ళ్ళరిగేటట్టు తిరిగినా ఒక్క కవళం కూడా దొరక లేదు." వా.
కాళ్లు కట్టివేయు
- ఏమీ చేయనీయక పోవు.
- "వాడు నన్ను కాళ్లు కట్టివేసి మూల్లో కూర్చో బెట్టాడు." వా.
కాళ్లు కట్టివేసినట్లుగా
- నిర్బంధములో ఉన్నట్లుగా.
- "అక్కడ పొలాల్లో చెడతిరిగేవాణ్ణి. ఈ పట్నానికి వస్తే కాళ్లు కట్టివేసినట్లుగా ఉంది." వా.
కాళ్లు కడిగి నీళ్ళు తాగు
- ఎంతో భక్తిగౌరవాలతో చూచుకొంటాను అను సంద