ఈ పుట ఆమోదించబడ్డది

అంద________అంద 16 అంది_________అంది

అందంబు గూడుకొను

  • ఇష్ట మున్నా లేకపోయినా ఇష్ట మున్నట్టు నటించు.
  • "మీద గార్యంబులు గలమాకు దీనిగా దనం బనిలే దని యందంబు గూడు కొని ఛందోనువర్తనపరుం డై."
  • ఆము. 6. 36.
  • శ. ర. లో 'కలిసికొను' అను అర్థ మిచ్చారు. అది కుదురుట లేదు.

అందముల దీవి

  • అందాల రాణి.
  • ఇక్కడ దీవి అంటే స్థానము.
  • " తావి తేనీయబావి యందముల దీవి."
  • హంస. 2. 20.

అందలమం దుంచినకుక్క

  • యోగ్య స్థాన మందున్న నీచుడు.
  • గువ్వల చెన్న. 90.

అందలంబులు

  • బాల్యక్రీడావిశేషము.
  • "అందలంబులు మఱి కుందికాళ్లు."
  • వి.పు. 7. 202.
  • వాడి భుజంమీద వీడి రెండు చేతులూ, వీడి భుజంమీద వాడి రెండుచేతులూ పెట్టి నడుమ ఒకపిల్ల వాణ్ణి ఎక్కించు కొని ;దేవుడమ్మ దేవుడూ' అని ఊరేగిస్తూ ఆడేఆట.

అంద ఱొకటి యగు

  • ఏక మగు.
  • "అనురక్తి మీ రంద ఱొక టై యాదరించరాదా? హేమా. పు. 34.

అంది పొందని

  • అతకని.
  • రుద్రమ. 56 పు.

అందిక పొందిక

  • ఈడుజోడు వంటిది. జం.
  • "దానికీ దీనికీ అందికా పొందికా లేదు." వా.

అందిన చేనిపంట

  • అందుబాటులోనిది.
  • "ఎందు చూచిన శ్రీ వెంకటేశు డున్నా డనియెడి అందినచేనిపంట లనుభవించు." తాళ్ల. సం. 9. 70.

అంది పుచ్చుకొను

  • గ్రహించు, దొరకి పుచ్చుకొను, సరిగ్గా అతికినట్టు.
  • "వాడు కాళ్లు అంది పుచ్చుకొన్నాడు."
  • "సిగ అంది పుచ్చుకొన్నాడు."
  • "వాడు అన్నదాని కల్లా వీడు అంది పుచ్చుకొన్నట్టుగా సమాధాన మిస్తూ వచ్చాడు." వా.

అంది పొందినట్టివారు

  • చుట్టాలు.
  • "ఈ ఊళ్లో అందిపొందినవారు ఎవరూ లేరు. అందుకని యేకార్య మయినా పొరుగూరుకు పోవలసి వస్తుంది." వా.

అందిన సిగ అందకున్న కాళ్లు

  • సమయానుకూలంగా ప్రవర్తించేవా డనుట.
  • "...ఏ మనవచ్చు నీగుణం, బవు నవు నందినన్ సిగయు నందక యున్నను గాళ్లు పట్టుకొం, దువు హరిణాంక..."
  • విజ. 3. 51.