ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కడి_____కడి 359 కడి_____కడి
- పరిహార మవుతుం దనీ అంటారు. వేంకటేశ. 44.
కడి గడి యగు.
- ఆహార మగు.
- "విడువక చేతిలో విష్ణు ప్రసాదము, గడి గడి యైనది కానీరు గాని." తాళ్ల. సం. 6. 10.
కడిగినముత్యంలాగా
- నిర్మలంగా, పరిశుభ్రంగా.
- "ఆ పిల్ల కేం? కడిగిన ముత్యంలా ఉంటుంది." వా.
- చూ. పులుగడిగిన ముత్యము.
కడిగి (పెట్టి) న సాలగ్రామం లాగా
- బోసిగా, ఏ నగా నాణ్యం లేకుండా.
- "వా డెంత సంపాదిస్తే మాత్ర మేం? పెళ్లాం మాత్రం కడిగిన సాలగ్రామం లాగా ఉంటుంది." వా.
కడిగి పెట్టిన గంగాళంలాగా
- సర్వశూన్యంగా.
- "ఆవిడ కడిగి పెట్టిన గంగాళం లాగా ఉంది. ఒక సొత్తా? ఒక చీరా?" వా.
కడిగి పెట్టిన నిప్పు లాగా
- నల్లగా, బొగ్గులాగా.
- వ్యంగ్యంగా అనుమాట.
- "ఆ పిల్ల కేం? కడిగిపెట్టిన నిప్పులాగా ఉంటుంది." వా.
కడిగి వదిలి పెట్టు
- అవమానించు; ఎదుటివాని లోపా లన్నీ బయట పెట్టు.
- "వా దీసారి కనబడనీ. కడిగి వదిలి పెడతాను. వాడు చేసిన వెధవపను లన్నీ నాకు తెలియనివా ఏమిటి?" వా.
కడిగొను
- తిను.
- "చిచ్చు కడిగొనగ వచ్చు నే?" భాగ. 8. 246.
కడిపెడు బిడ్డలు
- అధికసంతానం.
- "కాక యున్న మేము కడిపెడు బిడ్డల, వార మెట్లు బ్రతుకువార మనుజ" భోజ. 6. 144.
- చూ. కడుపు నిండా పిల్లలు.
కడి మాడ సేయునట్టి
- అమూల్య మయిన. భోజనవిషయంలోనే వాడుక. ఒకొక్కకడి (అన్నం ముద్ద) ఒక మాడ చేస్తుంది అనుట.
- "అమృతోపమానంబు లైన యన్నంబులు, కడి మాడ సేయంగ గుడుచువారు." విక్ర. 5. 124.
కడియపు చేమీదుగా దివముచేరు
- ముత్తైదువ చావు చచ్చు. కడియములు సౌభాగ్య చిహ్నములుగా ఇక్కడ భావింపబడినవ్వి. వాడుకలో కూడ నేడు 'ఆమె ముత్తైదువ చావు చచ్చింది. ముత్తైదువగా పోయింది' మొదలైన పలుకుబడు లున్నవి. అయిదువగా స్త్రీ చనిపోవుట