ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కట్టు____కట్టు 348 కట్టు____కట్టు
- "ఒక యిసుమంత వీడె గట్టుం గొంగున్." విజ. 2. 178. దశా. 3. 89.
- "ఈ చీర కట్టుకొంగుకంటే పైకొంగే భాగా ఉండి." వా.
కట్టుకొను
- 1. వివాహ మాడు. ఇది దక్షిణాంధ్రంలో ఈ అర్థంలో విశేషంగా వాడుకలో ఉన్నది.
- "మన పక్కింటి అమ్మాయిని వాడు కట్టుకొన్నాడు." వా.
- 2. ధరించు.
- "ఆవిడ చీర కట్టుకొని వచ్చేసరికి బండివేళ కాస్తా దాటిపోయింది." వా.
కట్టుకొమ్మ
- అడ్డుకట్ట, ఆనకట్ట.
కట్టుకోక
- మామూలుగా రోజువారీ కట్టుకొనే చీర.
- "దానికి కట్టుకోకలే లేవు. ఇంక దాపుడు కోకలు ఎక్కడనుంచి వస్తాయి." వా.
- చూ. కట్టుచీర; దాపుడుకోక.
కట్టుగడ
- దాపుడుధనము. బ్రౌను.
కట్టుగడ సేయు
- దాచు. బ్రౌను.
కట్టుగుండు
- 1. రాళ్లను పగులగొట్టుగుండు.
- "కొంద గట్టెడుకట్టుగుండ్లరవము." పరమయో. 5. 40. చంద్రా. 4. 214.
- 2. తూనిక రాయి.
- "ఈ కట్టుగుం డేమీ సరిగా ఉన్నట్టు లేదు. తాలూకా కచ్చేరిముద్ర ఉన్నదైతే కానీ నేను ఒప్పుకోను." వా.
కట్టుగుడ్డలతో
- వస్త్రమాత్ర నిర్వి శేషముగా. దేవీ. 7. 512.
కట్టుగుఱ్ఱము
- కట్టివేసిన గుఱ్ఱము. బ్రౌను.
కట్టుగొయ్య
- పశువులు మొదలయినవానిని కట్టివేయుటకై పాతిన కొయ్య.
- "కట్టుకొయ్యకు జేరి కామధేనువు దప్పె." కామా. 4. 111.
కట్టుగొట్టు
- కట్టుగొయ్య.
- చూ. కట్టుగొయ్య.
కట్టుగొఱ్ఱె
- చంపుటకై కట్టివేసిన గొఱ్ఱె. బ్రౌను.
కట్టుచీర
- రోజువారీ కట్టుకునే మామూలు చీర.
- చూ. కట్టుకోక.
కట్టు చెడు
- కట్టు తప్పు; విచ్చలవిడిగా ప్రవర్తించు.