ఈ పుట ఆమోదించబడ్డది
అంట_______అంటి 9 అంటి________అంటి
అంటముట్టరాని అగ్రహారము
- మతీ సున్నిత మైనమనిషి - ఏమన్నా ఓర్చుకో లేనివాడు అనుపట్ల ఉపయోగిస్తారు.
అంటరానివాడు
- అస్పృశ్యుడు.
- లక్షణయా సంబంధ ముంచు కొనరానివా డని అర్థ మయినది.
- "వాళ్లందరూ కలిసి న న్నంటరాని వాణ్ణిగా చూస్తున్నారు." వా.
అంటలుగట్టు
- అతుకుకొనిపోవు, గుంపు చేరు.
- "వాడు చాలనాళ్లు జబ్బుపడ్డాడు. వెంట్రుక లన్నీ అంటలు గట్టుకొని పోయినవి."
- "జనం అంటలు గట్టుకొని ఆతిరు నాళ్లను చూస్తున్నారు."
అంటించు
- ముట్టించు, కొండెములు చెప్పు.
- "సాయంత్రం అయింది. దీపం అంటించు. పొయ్యి అంటించు."
- "ఇక్కడ ఒకమాట అనీ అనక ముందే వాడు పక్కింటికి వెళ్లి అంటించి ఉంటాడు. అందుకే వాడంటే భయం నాకు." వా.
అంటి కుంచు ఆడుప్రాయము
- చిన్న తనము.
- ఆడుకొనువయసు అనుట.
- "అంటి కుంచి యాడునట్టిప్రాయ మొకింత, నడచునంతలోన నాదుసతులం, బుణ్యశీలయుతల బోకార్చుకొన్నట్టి, నాకు బుత్రు లనుట నగవు గాదె!"
- కళా. 6. 75.
- చూ. అంటకుండి ఆడు ప్రాయము.
అంటితే మసి అవుతుంది
- కల్పించుకొంటే ఏమి వస్తుందో అని దూరదూరంగా ఉండేవారివిషయంలో అనేమాట. వంటయింటిలో పుట్టినపలుకుబడి కావచ్చును.
- "వాడు అంటితే మసి అవుతుంది అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు." వా.
అంటి బాస చేయు
- ఒట్టు పెట్టుకొను.
- "అంటు పడ లేదటంచు మి మ్మంటి యిపుడు, బాస లెల్లను జేసెద భాసురాంగి." రాధి. 4. 10.
అంటి ముట్టక
- తనకు సంబంధము లేనట్లు.
- "వాడు ఈవిషయంలో అంటి ముట్టక తిరుగుతున్నాడు." వా.
అంటి ముట్టరాని అగ్రహారము
- సున్నిత మైనది.
- అగ్రహారాల్లో పూర్వం బ్రాహ్మలే ఉండేవారు. కాబట్టి అది చాలా ఆచారవంత మైనది అనుటపై యేర్పడిన పలుకుబడి. ఏమి అన్నా నొచ్చు కొనేవారి విషయంలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు.