ఈ పుట ఆమోదించబడ్డది
0క____ఒక్క 304 ఒక్క____ఒక్క
చెప్పులూ, అదే రంగు చేతి సంచి ధరిస్తారు.
- "ధనముల జాలెలు రతనపు, బని, తగు నొక వరుససొమ్ము బనిచిన గణనాథున కీవచ్చు గదా యని..." శుక. 2. 216.
ఒక విధంగా
- చూ. ఒక మోస్తరుగా.
ఒక వెలుగు వెలుగు
- కొన్నాళ్లు గొప్పగా బ్రతుకు.
- "ఏ మయితే నేం? వా డొక వెలుగు వెలిగాడు కదా!" వా.
ఒక హస్తపు మ్రొక్కు
- ఒంటిచేతి నమస్కారము.
- "నెన్నొసల్ కరమునం దిడి తీరనిషణ్ణ యై జలం, బాడగ బిల్చువారి నొక హస్తపుమ్రొక్కున నాడు డంచు." మను. 3. 86.
ఒక్క అంగలో
- గబాలున.
- "తుర్రు మని యొక్క యంగలో దూటి నాడు." మృచ్ఛ. 89.
ఒక్క కడుపువారు
- ఒకే జాతివారు. ఒక రకమే అనుట.
- "కాకవులు గాకవులు నొక్క కడుపు వారె." శ్రవ. 1. 10.
ఒక్కగా నొక్క...
- ఏకైకసంతాన మనుట.
- "ఉన్న ఒక్కగా నొక్క కొడుకూ చెడిపోతే వాడికి కష్టమే కదా!" వా.
- "లేక లేక వాళ్లకు ఒక్క గా నొక్క కొడుకు పుట్టాడు. అంచేతే ఆకొడుకంటే వారి కంత ప్రాణం." వా.
ఒక్క గోర తిరుగు
- ఒకేవిధంగా తిరుగు.
- "కరి రయంబున జిఱ్ఱన సారి వోలె నొక్క గోర దిరిగె." కుమా. 10. 66.
ఒక్క చిన్న మంత మాట యాడిన
- ఏమాత్రం నిందించినా.
- "చిన్న నాడును బ్రియు డొక్క చిన్న మంత, మాట యాడిన విని తాపమగ్న వగుదు." కళా. 4. 134.
ఒక్కటికి పదాఱు సెల్లించు
- గట్టిగా ఎదురుదెబ్బ తీయు.
- "ఇంతయు నేల మీకు నెదు రెక్కటిలో మునికిం బదాఱు సెల్లింతు గడళ్ల త్రాకున వెలింబడ." ఉ. హరి. 3. 117.
- "ఒకటికి పదహారు వడ్డించిందే తల్లీ నీ కోడలు. ఇంకా ఈ యింట్లో ఉండమంటావా?" వా.
ఒక్కటి అయితే
- ఏదో ఒకటి అయితే నేనే మగుదునో అనుపట్ల ఉపయుక్త మయ్యేపలుకుబడి. ఏదైనా ఒక అనాహూతం జరిగితే - అనుట.
- "తొడింబడ నితని కొక్కటి యయ్యె నేని..." కళా. 3. 264.
- "ఈ ముసలాయిన కేదో ఒక్కటి అయితే నాగతి యే మవుతుంది?" వా.
- చూ. ఒకటి యైన.