ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎగి____ఎగ్గు 252 ఎగ్గు____ఎటు

ఎగిరి గంతు వేయు

  • సంతోషపడు. క్రొత్త. 27.

ఎగిరిపడు

  • చాల కోపించు.
  • "వాడిపే రెత్తితే మా నాన్న ఎగిరిపడతాడు." వా.

ఎగ్గాడు

  • దూషించు.
  • "ఎగ్గాడి నారసా లేసినారు." నాయకు. పు. 13.

ఎగ్గుగొను

  • తప్పుగా తలచు.
  • "ఈ విభు డాడినది యెల్ల నెగ్గు గొనక." భార. కర్ణ. 2. 83.

ఎగ్గుతగ్గులు

  • హెచ్చుతగ్గులు.
  • "తగ్గుం గాక యా యెగ్గుత,గ్గులు."గుంటూ. ఉత్త. 63.

ఎగ్గు పుట్టు

  • హాని కలుగు.
  • "వీనిచేత నెట్టు కౌరవులకు నెగ్గుపుట్టు." భార. అర. 19. 4.

ఎగ్గులాడు

  • దూషించు.
  • "ఇప్పురంధ్రీరత్నంబు నిన్ని యెగ్గు లాడం దగదు." భాస్క. యుద్ధ. 2409.

ఎగ్గులు పట్టు

  • తప్పులు పట్టు.
  • "ఎగ్గులు పట్టు గుబుద్ధి పెద్దలన్." సింహా. 1. 18.
  • రూ. ఎగ్గులు వట్టు.

ఎగ్గులు వట్టు

  • తప్పు పట్టు.
  • "నను నెగ్గులు వట్టకుండినం బొందొనరున్." భార. కర్ణ. 1. 255.
  • రూ. ఎగ్గులు పట్టు.

ఎగ్గుసిగ్గులు

  • సిగ్గు, సంకోచము. జం.
  • "పోడిమి చెడి యెగ్గుసిగ్గులు లేక." రాధా. 5. 83.
  • "ఎగ్గూ సిగ్గూ లేని పిల్లలతో ఏం మాట్లాడుతాం?" వా.

ఎచ్చు కుందు లేక

  • హెచ్చుతక్కువలు లేక.
  • "ఇట్లు ప్రతిబాణముల హంసు డెచ్చు గుందు లేక పోరాడె." ఉ. హరి. 4. 289.

ఎటాడ బోగా నెటు వచ్చునో ?

  • ఏ మంటే ఏమి వస్తుందో ?/
  • "పూర్వపు నీ యత నుత్వ ధర్మమున్, మానక యేచుచున్న నది మామక భాగ్యము ని న్నెటాడబో,గా నెటు వచ్చునో తడవగా వెఱతున్." ప్రభా. 5. 3.
  • వాడుకలో:
  • "ఏ మంటే ఏమి వస్తుందో ? మన కెందుకని పలక్కుండా ఉన్నాడు." వా.

ఎటు తిరిగీ

  • ఏ మైనప్పటికీ; ఎలాగూ.
  • "ఎటు తిరిగీ వా డిక్కడికి రావలసిందే." వా.

ఎటు ననరాకుండు

  • ఏమనడానికి వీలు లేకుండు.