ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్యా_____ఉద్వా 211 ఉద్వా_ఉన్న

  • "వాడు చేసిన ఉద్ధారింపు ఏ ముంది." వా.
  • చూ. ఉద్ధరించాడు.

ఉద్యాపన సేయు

  • విసర్జించు. వ్రతాదులలో ఉద్యాపనపై వచ్చిన పలుకుబడి. వ్రతం ముగిశాక ఉద్యాపనం.
  • "విప్రమార్గ ముద్యా,పన సేతురె నిన్ను వంటి బ్రాహ్మణకులజుల్." నిరంకు. 2. 130.

ఉద్యోగరాఘవుడు

  • కార్యప్రవణుడు.
  • "ఉద్యోగరాఘపుం డని, పద్యంబుల నూక గేరి పంచల జదువన్, విద్యాధికులకు వల్లము, చోద్యంబుగ విడిచి లంజ చూడగ నిచ్చున్." బహులా. 5. 83. పు.

ఉద్వాసన అగు

  • స్థానభ్రంశ మగు.
  • "వాడు ఆ ఊళ్ళోనూ దురుసుగా ప్రవర్తించా డట. అక్కడా ఉద్వాసన అయిం దని విన్నాను." వా.
  • "వానికి ఆఫీసునుంచి ఉద్వాసన అయింది." వా.
  • చూ. ఉద్వాసన చెప్పు.

ఉద్వాసన చెప్పు

  • తొలగించు, స్థానభ్రష్ట మొనరించు. పూజాపునస్కారాలలో కలశాదులను ప్రతిష్ఠించుట, ఆపని తీరిన వెనుక ఉద్వాసనచేసి వాని నటనుంచి తొలగించుట ఆచారం. ఆ తొలగించుటనే ఉద్వాసనం అంటారు. అందుపై వచ్చినపలుకుబడి.
  • "వీడి సంగతి నలుగురికి తెలిసేసరికి ఆ ఊరినుంచి ఉద్వాసన చెప్పారు." వా.
  • చూ. ఉద్వాసన అగు.

ఉద్వాసన చేయు

  • చూ. ఉద్వాసన చెప్పు.

ఉనికిపట్టు

  • స్థానము.
  • "విజయంబునకు నీత డునికిపట్టు." ఉ. రా. 5. 140; సుదం. 3. 194,
  • చూ. ఉన్కిపట్టు.

ఉన్కిపట్టు

  • నెలవు.
  • పాండు. 1. 193.
  • చూ. ఉనికిపట్టు.

ఉన్నట్టుండి

  • హఠాత్తుగా.
  • "వాడు ఉన్నట్టుండి అక్కడికి వచ్చాడు." వా.
  • "ఉన్నట్టుండి వానికి జబ్బు చేసింది." వా.

ఉన్నది పుష్ఠి

  • కలిమి మాత్రమే బలము.
  • "ఉన్నది పుష్టు మానవుల కోయదుభూషణ యాలజాతికిన్, దిన్నది పుష్టి..." పాండవో. 8.

ఉన్న దున్నట్టుగా

  • యథాతథముగా.
  • "వచియించెద మున్నది యున్న రీతిగా." నానా. 18.